NTV Telugu Site icon

Bhatti Vikramarka: ఎన్నికల కోడ్ ముగిసింది.. అధికారులు జవాబుదారీ తనంతో పనిచేయాలి..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మధిర అభివృద్ధిపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ ముగిసింది అధికారులు అభివృద్ధి పనుల వేగవంతం పెంచాలన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చామన్నారు. అధికారుల జవాబుదారీ తనంతో పనిచేయాలని తెలిపారు. మధిర అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం 25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాగా.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద, యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నునొప్పి వంటి ఖరీదైన వ్యాధుల చికిత్సలు, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ఉన్న పథకాలకు సంబంధించి నూతన చికిత్సా విధానాలు, ఆర్థిక సవరణల కోసం రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కతో సమావేశం జరిగింది.

Read also: Public Romance: పబ్లిక్‌ రోడ్డుపై కదిలే స్కూటర్‌ లో రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన జంట..

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు 2007లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 2.84 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఈ పథకం ద్వారా వారికి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. రాష్ట్రంలోని 1402 ఆసుపత్రుల ద్వారా ఈ సదుపాయం కల్పించబడింది. ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వైద్య నిపుణుల సూచనల మేరకు 1375 ప్రొసీజర్లకు ప్యాకేజీ ధరలను పెంచుతూ డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్ సన్, వెన్నుపూసలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో అమలు చేయని 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్‌లో ఉన్న 98 చికిత్సా విధానాలను రాజు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 189.83 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా, 65 కొత్త చికిత్సలను అంగీకరించడం వల్ల ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు చేస్తుంది. పైన పేర్కొన్న సవరణల ఫలితంగా, కొత్త చికిత్సా విధానాలను చేర్చడం కోసం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ సమావేశంలో ప్రభుత్వం అదనంగా రూ.497.29 కోట్లు మంజూరు చేసింది.
Union Cabinet: కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్..

Show comments