Site icon NTV Telugu

Bhatti Vikramarka : విద్యపై రాజీ లేదు…అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య

Bhatti Vikramarka

Bhatti Vikramarka

మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, గుత్తేదారులతో సమీక్ష నిర్వహించి, నిర్మాణంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని, అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల చుట్టుపక్కల రహదారుల నిర్మాణంపై కూడా అధికారులతో చర్చించి, సులభ రవాణా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

CM Chandrababu: విజయవాడ వీధుల్లో సీఎం చంద్రబాబు కాలి నడక.. చిరు వ్యాపారులతో మాట ముచ్చట!

భట్టి విక్రమార్క నిర్మాణ స్థలంలో పునాదులను స్వయంగా పరిశీలించి, కన్‌స్ట్రక్షన్ ప్లాన్‌ ని పరిశీలించారు. పనుల నాణ్యత, ఉపయోగిస్తున్న మెటీరియల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. పనుల్లో వేగం పెంచి, అవసరమైన కూలీలను తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని గుత్తేదారులను ఆదేశించారు. విద్య అనేది భవిష్యత్తు తరాలకు అందించే గొప్ప ఆస్తి అని పేర్కొన్న భట్టి విక్రమార్క, తెలంగాణ బిడ్డలకు ప్రపంచస్థాయి విద్య అందించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. “విద్య విషయంలో ప్రజా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదు” అని స్పష్టంగా తెలిపారు.

Lakshmi Puja Timings: ఈ టైమ్‌లో పూజిస్తే లక్షాధికారులు అవుతారు!

Exit mobile version