NTV Telugu Site icon

Bhatti Vikramarka: తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదు.. కేసీఆర్ మోసం చేశారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka Fires On CM KCR In Tandoor Corner Meeting: నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం.. ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని, ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. తాండూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 198 ఇళ్లు పంపిణీ చేశామని.. అయితే ఇప్పటివరకు ఆ కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. తాండూరు మండలంలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. మూడు ఎకరాల భూ పంపిణీ చేయకుండా కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో ఇంటికో కొలువు ఇస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు.

Minister KTR: మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం

నాలుగున్నర కోట్ల ప్రజలకు చెందాల్సిన తెలంగాణ సంపదను.. కేసీఆర్ కుటుంబంలో ఉన్న నలుగురు పంచుకొని తింటుంటే చూస్తూ ఊరుకుందామా? అని ప్రజల్ని ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన 18లక్షల కోట్లు.. అలాగే ప్రజలందరిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.5 లక్షల కోట్లు ఏమయ్యాయి? అని నిలదీశారు. ఆ డబ్బులతో ఇళ్లు కట్టారా? ఉద్యోగాలు ఇచ్చారా? నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమీ చేయకుండా ఆ డబ్బులను ఏం చేశారని అడిగారు. రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం, అది చేయకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు అప్పు తెచ్చి సాగు చేసి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ మైనింగ్ వనరులను ఆంధ్రాకు చెందిన బడాబాబు కంపెనీలకు కేసీఆర్ ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మన కొలువులు మనకే.. మన వనరులు, సంపద మనకే అని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. 1.15 లక్షల మంది పనిచేస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసి, 60వేల ఉద్యోగాలు తొలగించే కుట్ర జరుగుతోందని వెల్లడించారు.

Revanth Reddy: పేపర్ లీకేజీలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మన కొలువులు మనమే చేసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని మాటిచ్చారు. అంతేకాదు.. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ను అందజేస్తామన్నారు. తెలంగాణ సంపదను కేవలం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాత్రమే ఖర్చు పెడతామని తెలియజేశారు.