NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: గత పాలనను మర్చిపోయారా..? హరీష్ రావు కు భట్టి విక్రమార్క కౌంటర్

Bhatti Vikramarka Vs Harish Rao

Bhatti Vikramarka Vs Harish Rao

Mallu Bhatti Vikramarka: హరీష్ రావు కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్ళ పాలనను హరీష్ రావు మర్చిపోయారా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ మా ఫస్ట్ ప్రేయారిటి అన్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్డడే వ్యక్తులను ఉక్కుపాదంతో అనిచివేస్తామన్నారు. బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళిక ఆవిష్కరించారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. బ్యాంకర్స్ కు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు అన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Read also: Kakatiya University: డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి.. కేయూ విద్యార్థుల ఆందోళన..

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్లో పెట్టదన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తుందన్నారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలి అభి అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించేవన్నారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది.. రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవన్నారు.

Read also: Kaushik Reddy: మీ డిమాండ్ లు మీకు తెలియదా?.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై పాడి కౌశిక్‌ రెడ్డి ఫైర్‌

రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చిన విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఉండదన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందన్నారు. దేశ సంపద అన్ని వర్గాలకు సమానముగా పంచాలనేది రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. ఉమ్మడి కుటుంబం మాదిరిగా జాతి ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ విధానమన్నారు. అదే జాతికి ఆయన పిలుపు నిచ్చారన్నారు. దేశ సంపద అందరికి పంచాలని రాహుల్ గాంధీ విధానం అన్నారు. పెట్టుబడి దారులకు పంచడం బీజేపీ విధానమని కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు సంపదలో వాటా.. అధికారం లో వాటా ఉండాలి అనేది కాంగ్రెస్ విధానమని తెలిపారు. పెద్ద ప్రాజెక్టులు టెక్నీకల్ నాలెడ్జి ఉన్న వాళ్ళు కట్టాలన్నారు. వాళ్ళు కాదు నేనే కడతా అని కేసీఆర్ కడితే కాళేశ్వరం కూలిపోయిందన్నారు.

Read also: CM Revanth Tweet: తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవం.. సీఎం రేవంత్ ట్విట్‌ వైరల్‌

పనిలేని వాళ్ళు కొందరు పనికి మాలిన మాటలు మాట్లాడతారి మండిపడ్డారు. పని లేక గాడిద పళ్ళు తోమారు అనే వాళ్ళు.. ఇప్పుడు అదే మాటలు మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం గురించి నిపుణులు సలహాలు మేరకు పనులు చేస్తామన్నారు. మేము చేసిన అప్పులో.. అప్పుల కోసం కట్టినవే ఎక్కువ అన్నారు. 36 వేల కోట్లు అప్పులకు కట్టిన్నామని తెలిపారు. బడ్జెట్ లో పొందుపరిచిన మేరకు అప్పులు తెస్తున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు అనేది చూస్తున్నామని తెలిపారు. దాని ఆధారంగా బడ్జెట్ పెడతామన్నారు. జగదీశ్ రెడ్డి నే.. జ్యుడీషియల్ విచారణ అడిగారని తెలిపారు.

Read also: Fake Gold: తక్కువ ధరకు బంగారం.. రూ.1.1 కోట్లు టోకరా

మేము ప్రజాస్వామ్యం నమ్మే వాళ్లుగా… విచారణకు అదేశించామన్నారు. కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్ కాదన్నారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన ఆయనే విచారణ అడిగితే వేశామన్నారు. కమిషన్ ఎవరు ఉండాలని మేము వేసింది కాదు.. మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మేము ఎవరం రోజు వారీ సమీక్ష చేయడం లేదన్నారు. జ్యుడీషియల్ విచారణ తప్పు పెట్టాల్సిన అవసరం ఏముందని తెలిపారు. దిగిపో అనాల్సిన పనేముంది అని మండిపడ్డారు. వెళ్లి వివరాలు ఇవ్వచ్చుగా అన్నారు. ఎందుకు అంత భయపడుతున్నారని తెలిపారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రైతు బంధు వేయరు అనే ప్రచారం చేశారు.. కానీ వేసి చూపించామన్నారు. రుణమాఫీ మిలాగా నాలుగు సార్లు చేస్తామని.. అనలేదన్నారు. అందరూ మిలాగే ఉంటారని అనుకోకండి అన్నారు. మేము చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
నోరు తెరిచి నిద్రపోతున్నారా..? అయితే మీకు..!