NTV Telugu Site icon

Bhatti Vikramarka: అందరికి ఒకటే మాట.. ఆరో తేదీ వరకు దరఖాస్తు తీసుకుంటాం..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: ఆరో తేదీ వరకు దరఖాస్తు తీసుకుంటామని అందరికి ఒకటే మాట చెబుతున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సువర్ణాక్షరాలతో లికించే రోజు ఇవాళ అని, కాంగ్రెస్ ఆవిర్భవించిన రోజని అన్నారు. పరాయి పాలనలో మగ్గిపోతున్న ప్రజల సంకెళ్లు తెంచిన పార్టీ పుట్టిన రోజు అన్నారు. కోరి కోట్లాది తెచ్చిన తెలంగాణలో ప్రజల లక్ష్యాలు నెరవేరలేదన్నారు. ప్రజా పాలన కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. మా విజయం ప్రజలకే అంకితం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు ఇండ్లు లేని వాళ్ళు.. పెన్షన్ లేని వాళ్ళు గృహజ్యోతి కింద రావాల్సిన విద్యుత్ అంశాలు అన్ని అమలులోకి వస్తాయని అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం.. దొరల ప్రభుత్వం కాదన్నారు. మాలాగే ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండు అని బీఆర్ఎస్ చూస్తుందన్నారు.

Read also: Central Govt: పాకిస్థాన్‌లోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టును భారత్ కు తీసుకువస్తాం..

9 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని దుర్మార్గపు పాలన వాళ్ళదన్నారు. పేదలకు పంచిన భూముల్ని లాక్కుంది గత ప్రభుత్వం అని మండిపడ్డారు. వీటన్నిటికీ విమోచన కలిగించారు ప్రజలన్నారు. ప్రతీ ఊర్లో కౌంటర్ ఉంటుందన్నారు. ఆరో తేదీ వరకు ధరఖాస్తు తీసుకుంటామన్నారు. అందరికి ఒకటే మాట అన్నారు. ఈ ప్రభుత్వం అందరిదీ.. ఏ ఒక్కరికో.. ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదన్నారు. గత పాలకుల లెక్క మా పార్టీలోకి వస్తేనే ఇల్లు.. పెన్షన్ ఇస్తం అనేది ఉండదన్నారు. బెదిరింపులు ఉండవు.. ఏ పార్టీ వాళ్ళు అని చూడం.. ఈ రాష్ట్ర పౌరుడు అయ్యి ఉంటే చాలు అనేది మా విధానమన్నారు. ప్రజలకే ఈ ప్రభుత్వం అంకితమన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉచిత బస్సు అమలు చేశామని, 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచామన్నారు.
Mohammed Shami: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదు!