Site icon NTV Telugu

Bhatti Vikramarka : బియ్యం సంచి లేదు..సంచిలో సరుకూ మాయం..

CLP leader Mallu Bhatti Vikramarka Questioned TRS Government at TS assembly Budget meetings 2022.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే నిన్న సీఎం కేసీఆర్‌ సంచనల ప్రకటన చేస్తానని చెప్పి.. చెప్పిన విధంగానే ఈ రోజు ఉదయం అసెంబ్లీలో జాబ్‌ నోటిషికేష్లన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం నుంచి ప్రస్తుతం వరకు చేసిన పనులను వివరించారు. ఇదిలా ఉంటే.. అనంతరం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు బియ్యంతో పాటు 9 వస్తువుల సంచి ఇచ్చామని, రాష్ట్రం సంపద పెరిగింది.. కానీ పేదలకు ఇచ్చే బియ్యం సంచి లేదు..సంచిలో సరుకు కూడా మాయం అయ్యిందని ఆయన అన్నారు.

నిత్యావసరాల ధరలు కనీసం నియంత్రణ చేయరని, సంపద పెరిగింది అని మరోవైపు అంటారు.. పేదలకు అందని సంపద ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ ఏమైంది.. వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది.. బ్యాంకులు రైతు బంధు డబ్బులను కూడా లోన్ కింద కట్ చేస్తున్నారని ఆయన అన్నారు. రైతు బంధు ఇస్తున్న అంటున్నారు… ఎరువుల ధరలు పెంచారు.. సబ్సిడీ లపై కోతలు పెట్టారు.. ఐదు వేలు ఇచ్చి .. ఇవన్నీ రద్దు చేస్తే ఏం లాభం అని ఆయన విమర్శించారు. పెరిగిన సంపద… పేదలకు ఎలా పంచాలి అనేది ఆలోచన చేయండని ఆయన అన్నారు. మంత్రి పైనా సూపారీ చేసే పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, మంత్రికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ …సుపారీ అంశం పై స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

https://ntvtelugu.com/rbi-launches-upi-123-pay-for-feature-phones/
Exit mobile version