Site icon NTV Telugu

Bhatti Vikramarka : టెక్నాలజీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ

Bhatti Vikramarka

Bhatti Vikramarka

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆదర్శ నేత అని, దేశం ప్రపంచంతో పోటీ పడటంలో రాజీవ్ గాంధీ పునాదులు వేశారంటూ.. ఆయన వ్యాక్యానించారు. 18 ఎండ్లకే ఓటు హక్కు ఇచ్చిన ఘనత రాజీవ్ గాంధీ ది అంటూ ఆయన కొనియాడారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చింది కూడా రాజీవ్ గాంధీనే అని, టెక్నాలజీను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ ఆయన వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా తాగు నీరు ఇవ్వాలని విజనరీ ఉన్న నేత రాజీవ్ గాంధీ అని, ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచనా చేయలేదు అని కొందరు ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మొబైల్ నీ పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ.. అస్సాం..తమిళనాడులలో అలజడులు సమైక్యత కాపాడారని ఆయన గుర్తు చేశారు.

Exit mobile version