Bhagwant Mann Singh Fires On BJP In BRS Party Meeting: ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ బీజేపీపై నిప్పులు చెరిచారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని.. ఎమ్మెల్నేల్ని కొనాలి, అధికారంలోకి రావాలి అనేదే ఆ పార్టీ సూత్రమని విమర్శించారు. తొలుత ఆయన సభను ఉద్దేశించి.. సభకు వచ్చిన జనం చూస్తుంటే అద్భుతంగా ఉందన్నారు. ఏవైనా ప్రత్యేక కళ్లద్దాలు తయారు చేసి ఉంటే.. ఇంత జనాన్ని ఆ అద్దాల నుంచి చూసేవాడిని పేర్కొన్నారు. అనంతరం బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. ఈ దేశం రంగు రంగుల పూల సమాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారని కౌంటర్ వేశారు. ప్రతీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారని.. కానీ అవి జుమ్లాలుగా నిలిచిపోయాయని అన్నారు.
Arvind Kejriwal: గవర్నర్లను మోడీ ఆడిస్తున్నారు.. బీజేపీని తరిమికొట్టాలి
విదేశాల్లో ఉన్న అవినీతి డబ్బుని దేశానికి తీసుకొచ్చి.. ప్రతి ఒక్కరి ఖాతాలోకి రూ.15 లక్షల ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చారని.. అది కూడా అబద్ధంగా నిలిచిపోయిందని భగవంత్ మాన్ సింగ్ విమర్శించారు. బీజేపీ అబద్ధాల పార్టీగా మారుతోందని.. ఎమ్మెల్యేలను కొనడం, ఉప ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందని అన్నారు. బీజేపీ నడిపిస్తోంది లోకతంత్రం కాదు.. లూటీతంత్రమని ఎద్దేవా చేశారు. అన్ని లూటీ చేయడమే బీజేపీ పని అని.. రైల్వే, ఎల్ఐసీ, ఎయిర్‌పోర్టులను అమ్మేసిందని అన్నారు. కేవలం మీడియాను మాత్రమే కొనుగోలు చేసి, అందులో తన సొంత డబ్బా కొట్టించుకుంటోందని సెటైర్ వేశారు. అన్ని తమకోసమే అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని.. అన్ని రాష్ట్రాల్ని ఆరాటపడుతోందని పేర్కొన్నారు. కానీ సమయం అన్నీ నేర్పుతుందని, రాజుల్ని కూడా అడుక్కునేలా చేస్తుందని బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు. కేజ్రీవాల్ స్కూళ్లపై విమర్శలు చేసిన బీజేపీ.. ట్రంప్ సతీమణి వచ్చినప్పుడు కేజ్రీవాల్ స్కూల్‌నే బీజేపీ చూపించిందని వ్యాఖ్యానించారు.
Akhilesh Yadav: బీజేపీ కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఆ పార్టీని తరిమికొట్టండి
ఇక తెలంగాణ పథకాలపై ప్రశంజలు కురిపించిన భగవంత్ మాన్ సింగ్.. పంజాబ్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం లాంటి పథకాలను ప్రవేశపెడుతామన్నారు. కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమని కొనియాడారు. మంచి పనులు చూసి నేర్చుకోవాలని.. ఇవి నాలెడ్జ్ షేరింగ్ రోజులని చెప్పారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంచి హృదయం ఉన్న నేతలు ఈ దేశంలో లేరని, ఉంటే దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు.
Pinarayi Vijayan: రాజ్యాంగాన్ని కాపాడేందుకు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి