NTV Telugu Site icon

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. వనమా రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని లేఖలో వనమా వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.

అంతేకాకుండా పోలీసులకు, న్యాయవ్యవస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. వనమా రాఘవను నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాఘవ విషయంలో విచారణ నిష్పక్షపాతంగా జరపాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా..నా కుమారుడిని అప్పగిస్తానని ఆయన తెలిపారు.