NTV Telugu Site icon

Godavari Flood: తగ్గుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు ప్రవాహం..

Godavari Flood

Godavari Flood

Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. గత నెల 22వ తారీకు నుంచి పెరుగుతున్న గోదావరి ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్ట ప్రస్తుతం 43.1 అడుగుల వద్ద ఉంది ఇది మరో రెండు పాయింట్లు తగ్గితే ఈ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించు కుంటారు. ఎగువన మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగులు వంకలు పొంగి భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. గత నెల 23వ తారీకు నాడు గోదావరి నీటిమట్టం 51.1 అడుగులకు చేరుకుని ఆ తర్వాత 44 అడుగులకు తగ్గింది. మళ్లీ రెండు రోజుల్లోనే గోదావరి పెరిగింది. గత నెల 27న 53.9 అడుగులకి గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద పెరిగింది. దీంతో దీంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Read also: Indian Railway: దేశంలోనే నాన్ స్టాప్ రైలు.. 6 గంటల్లోనే 493 కి.మీల జర్నీ..!

పలు ప్రాంతాలకు ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. భద్రాచలం నుంచి కూనవరం వైపు భద్రాచలం నుంచి చర్ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి అయితే గోదావరి నీటిమట్టం తగ్గిన తర్వాత మళ్లీ పునరుద్ధరణ ప్రారంభమైంది. భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీలకు కూడా మురుగునీరు చేరింది. దీంతో కాలనీలు ముంపుకు గురయ్యాయి. పునరావస చర్యలు తీసుకున్నారు. కాగా మళ్లీ గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరుకొని వెంటనే మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 45 అడుగులకు చేరుకొగా… మళ్లీ తగ్గడం ప్రారంభించింది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు ఉంది. ఇప్పటికే ముడు రెండు ప్రమాద హెచ్చరికలను తొలగించారు. మరో రెండు పాయింట్లు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక తొలగిస్తారు. ఎగువ నుంచి గోదావరి తగ్గుముఖం పట్టింది. ఎగువన ఎటువంటి వర్షాలు లేకపోవడంతో గోదావరి వరద పూర్తిగా తగ్గవచ్చు. అని అధికారులు వచ్చిన వేస్తున్నారు.
BRS MLAs: అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..