Site icon NTV Telugu

Bhadradri Kothagudem: అధికారులు వేధిస్తున్నారు.. ఆసుపత్రి భవనం ఎక్కిన యువకులు..

Bhadradri Kotha Gudam

Bhadradri Kotha Gudam

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆసుపత్రి భవనం ఎక్కి యువకులు హల్ చల్ చేసిన తీరు జిల్లాలో సంచలనంగా మారింది. మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం చుట్టూ తిపించుకుంటూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పై అధికారులు న్యాయం చేయాలంటూ యువకులు ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఎక్కిన తీరు జిల్లాలో కలకలం రేపుతుంది. అధికారుల వేధింపులు తాళలేక ఐదుగురు తాత్కాలిక ఉద్యోగులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. భూక్య జయకృష్ణ, నాగబాబు, సీతారాం, శంకర్రావు, సరిలాల్ అనే ఐదుగురు యువకులు గత రెండేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో పేషెంట్ కేర్ గా పనిచేస్తున్నారు.

Read also: NDA : ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం.. ఎంపీలకు మోడీ ఏం చెప్పారంటే ?

ప్రస్తుతం తాము పనిచేస్తున్న సహారా ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల జీతానికి రూ.16,800 ఖాతాలో రూ.11వేలు మాత్రమే జమ అవుతోందని, ఈఎస్ ఐ, పీఎఫ్ మినహాయిస్తే రూ.2వేలు ప్రతినెలా మరో మూడువేల ఎనిమిది వందలు పోతున్నాయని వాపోతున్నారు. పేషంట్ కేర్ కోసమని తమను తాత్కాలిక ఉద్యోగాలలో నియమించి అన్ని రకాల పనులను చేయిస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ హాస్పటల్ సూపరింటెండెంట్ స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. పోలీసుల జోక్యం, సహారా ఏజెన్సీ హామీతో విషయం సద్దుమణిగిందని సమాచారం.
Janasena: ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన జనసైనికులు.. ఈఎంఐ మాత్రం కట్టుకోవాలి..!

Exit mobile version