NTV Telugu Site icon

Godavari Floods: దారుణం.. భద్రాచలంలో రెండు రోజులుగా మృతదేహం..

Godavi Flood

Godavi Flood

Godavari Floods: గోదావరి ఉప్పొంగడంతో వరద కష్టాలు అన్ని ఇన్ని కాదు.. చనిపోయిన మృత దేహాన్ని తరలించడం కూడా కష్టతరంగా మారింది. దీంతో రెండు రోజులుగా మృతదేహం భద్రాచలంలోని ఉండి పోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు జిల్లా కూనవరం మండలం టేకుల లొద్ది గ్రామానికి చెందిన కొండరెడ్ల 12 కెచర్ల శివారెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. గోదావరి వరద వచ్చిన తర్వాత అనారోగ్యం పాలు కావడంతో అతనిని అంబులెన్స్ లో విజయవాడకి తీసుకెళ్తున్నారు. భద్రాచలం మీదుగా విజయవాడకి తీసుకెళ్తున్నారు. కూనవరం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాలంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి నెలకుంది. అయితే మార్గ మధ్యలో ఆరోగ్యం క్షీణించి శివారెడ్డి చనిపోవడంతో అతని మృతదేహాన్ని తిరిగి తమ గ్రామానికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. భద్రాచలం నుంచి కూనవరం రోడ్ పై వరద వచ్చింది.. కానీ గోదావరి వరద తమ గ్రామానికి తీసుకు వెళ్ల నివ్వలేదు. దీంతో ఆ మృతదేహాన్ని భద్రాచలం లోని ఏరియా ఆసుపత్రిలోనే ఫ్రీజర్ లో పెట్టి ఉంచారు.

Read also: Jagga Reddy: వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా సీఎం అవుతా.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు తగ్గుతూ..పెరుగుతు ప్రవహిస్తున్నాయి.. మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణిహిత నదిలోకి భారీగా వరద నీరు ప్రవహించడంతో ఇటివల ఒక సారి కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా ,మరో సారి ఫస్ట్ వార్నింగ్ కి దగ్గరగా ప్రవహించి తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా తగ్గుతూ..పెరుగుతుంది‌. దీంతో తీరం వద్ద 9.360 మీటర్ల ఎత్తులో పుష్కర్ ఘాట్ ను తాకుతూ ఉభయ నదుల ప్రవాహం దిగువకు తరలిపోతుంది.‌ దిగువన ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ కి 4,75,210 క్యూసెక్కులు వరద వస్తుండడంతో బ్యారేజ్ లోని మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు తరలిస్తున్నారు. కాగా అన్నారం సరస్వతీ బ్యారేజ్ వద్ద 8,147 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ఇరిగేషన్ అధికారులు బరాజ్ లోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Terror Attack: జమ్మూ ప్రాంతంలో 60 మందికి పైగా ఉగ్రవాదులు..సాయం చేస్తున్న దేశ ద్రోహులు వీరే!