NTV Telugu Site icon

Kothagudem: కేటీపీఎస్‌ పాత ప్లాంట్‌ కూలింగ్‌ టవర్ల కూల్చివేత..

Kothagudem

Kothagudem

Kothagudem: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్‌ను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) ప్లాంట్‌ కూల్చివేత తుదిదశకు చేరుకుంది. ఓ అండ్ ఎంకు చెందిన 8 యూనిట్ల ఎనిమిది కూలింగ్ టవర్లు నేలకొరిగాయి. అధికారులు ముందుగా నాలుగు టవర్లను కూల్చివేసి, మరో నాలుగు టవర్లను తొలగించారు. ఓఅండ్‌ఎం ఫ్యాక్టరీ మూతపడటంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల విస్తీర్ణాన్ని వినియోగించుకునేందుకు యాజమాన్యం టవర్లను పేల్చివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల మోడల్ కోడ్ అమలులో ఉన్నందున కూలింగ్ టవర్ల కూల్చివేతకు అనుమతి ఆలస్యమైంది.

Read also: Mallu Bhatti Vikramarka: మధిరలో ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రం.. రింగ్ రోడ్ల నిర్మాణాకి ప్రణాళికలు..

జెన్‌కో ద్వారా టెండర్లు ఆహ్వానించగా, హెచ్‌ఆర్ కమర్షియల్‌కు కొన్ని నెలల క్రితం రూ.485 కోట్లకు కాంట్రాక్ట్ వచ్చింది.100, 120 మీటర్ల ఎత్తులో కూలింగ్ టవర్లు పాత KTPS ప్లాంట్‌లో ఇప్పటికే గత ఫిబ్రవరిలో నేలమట్టం చేశారు. 1965-67 నుండి 78 వరకు దశలవారీగా నిర్మించిన ఎ, బి, సి పవర్ స్టేషన్లలో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఎనిమిది కూలింగ్ టవర్లు నిర్మించబడ్డాయి. ఇందులో భాగంగా అప్పటి కర్మాగారానికి సంబంధించిన మెటీరియల్ మొత్తాన్ని కంపెనీ తీసుకుంది. మిగిలిన 8 కూలింగ్ టవర్లను ఇవాళ (సోమవారం) ఉదయం 8 గంటలకు కూల్చివేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడింది. కాగా, టవర్ల కూల్చివేత సందర్భంగా ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో అధికారులు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
Double Ismart: లైగర్ పంచాయతీ.. రంగంలోకి టాప్ డిస్ట్రిబ్యూటర్.. కొలిక్కి వచ్చేనా..?