Bhadradri Kothagudem Floods Updates.
గత వారం తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలకు వాగులు వంకలు, చెరువులు నిండిపోయాయి. అంతేకాకుండా.. ఎగువన రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురియడంతో.. తెలంగాణలోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా వరదలతో పలు గ్రామాలు జలదిగ్బంధలోకి వెళ్లాయి. కొన్ని గ్రామాలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చి జిల్లాలోని ప్రజలపై భయాందోళనకు గురి చేసింది. ఇళ్లలోకి నీరు చేరడంతో వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే.. గోదావరికి వరద తగ్గుతున్నప్పటికీ భద్రాచలంలోని రామాలయం పరిసర ప్రాంతాల్లో లీకేజీ వాటర్ ముంపు నుంచి బయటపడటం లేదు. భద్రాచలం పట్టణంలోనే అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణగా రామాలయం పరిసరాలు మారాయి. గోదావరిలో 70 అడుగులు ఉన్నప్పుడు భారీ వర్షాలు వస్తున్నప్పుడు రామాలయం పరిసరాల్లోకి వచ్చిన నీరు వచ్చినట్లుగా గోదావరిలోకి పంపిణీ చేయించగలిగారు. కానీ గోదావరి తగ్గిన తర్వాత వర్షాలు లేకపోయినప్పటికీ గత నాలుగు రోజుల నుంచి రామాలయం పరిసరాలు వరద నీటితో ముంపులో ఉండిపోయాయి. ముంపు బాధితులను పునరావాసానికి పంపించినప్పటికీ అక్కడ వారికి సరైన వసతులు కల్పించలేదు .మరోవైపున ముంపుకు గురైన ప్రాంతాన్ని కనీసం అధికారులు వచ్చి భరోసా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమూ కట్టుబట్టలతో బియ్యంతో సహా మొత్తం తడిసిపోయాయని ఇప్పుడు మేము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కనీసం వండుకోవడానికి బియ్యం కూడా లేవని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు