NTV Telugu Site icon

Viral: మరో వివాదంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే.. నీ సంగతి చూస్తా..!

అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు… సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇచ్చారు ఎమ్మెల్యే.. ఎదైనా పిచ్చి పోస్టులు పెడితే సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించిన ఆయన.. ఇంకో సారి పోస్టు పెడితే నీ సంగతి చెబుతా నంటూ సీరియస్‌గా హెచ్చరించారు.. తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన స్వామి అనే వ్యక్తికి ఫోన్‌ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. బెదిరింపులకు దిగారు.. ఇప్పుడా ఆ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది…

Read Also: Somireddy: అనాలోచితం.. మళ్లీ జిల్లాలను మారుస్తారా..?

కాగా, గతంలోనూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు వచ్చాయి… బెల్లంపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్​పై అవిశ్వాసం సందర్భంగా కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురుకు ఫోన్​చేసి బెదిరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.. ఇక, పంచాయతీరాజ్​ డీఈఈపై మాటలతో విరుచుకుపడ్డారు.. ఇక, ఓ భూ వ్యవహారంలో తలదూర్చినట్టు కూడా విమర్శలు వచ్చాయి.. ఆ తర్వాత బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరులతో తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందంటూ బెల్లంపల్లికి చెందిన టీఆర్ఎస్​మహిళా నేత తోడె పద్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి వార్నింగ్‌ ఇచ్చి.. సోషల్‌ మీడియాకు ఎక్కారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.