Site icon NTV Telugu

Begum Bazaar: ప‌రువు హ‌త్య కేసులో.. మొత్తం 9మంది అరెస్ట్

Begumbazar

Begumbazar

హైదరాబాద్‌ బేగం బజార్‌ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య తర్వాత కర్నాటక పారిపోయిన నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. నీరజ్ పన్వార్ పరువు హత్య కేసులో అరెస్టైన మొత్తం నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది

ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్ పై కక్ష కట్టిన యువతి కుటుంబీకులు బేగం బజార్‌లో అత్యంత పాశవికంగా హతమార్చిన విషయం తెలిసిందే.. బేగంబజార్‌లోని షా ఇనాయత్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మచ్చీ మార్కెట్‌లో ఈ హత్య జరిగింది. రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు అందరూ చూస్తుండగానే నీరజ్‌ పన్వార్‌పై కత్తులతో విరుచుకుపడ్డారు. అతన్ని 20 కత్తిపోట్లు పొడిచారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నీరజ్‌ పన్వర్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

నీరజ్‌ ఏడాది క్రితం, సంజన అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.ఆరు నెలల క్రితం వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం నీరజ్‌ పన్వార్‌ బేగం బజార్‌లో ఉండగా.. భార్య అప్జల్‌ గంజ్‌లో ఉంటోంది. ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కక్షతోనే నీరజ్‌పై అమ్మాయి కుటుంబీకులు దాడికి పాల్ప‌డ్డారు. సరూర్‌ నగర్‌లో పరువు హత్య మరువక ముందు…. మళ్లీ అలాంటి పరువు హత్య జరగడంతో.. పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు..

అరెస్ట్ అయి రిమాండ్ వెళ్ళిన నిందితుల వివరాలు..

A-1) అభినదన్ యాదవ్ @, కోల్‌సవాడి, బేగంబజార్, హైదరాబాద్.
A-2) కరికియాల వంశ్ యాదవ్@ బేగం బజార్
A-3) కబాలియే సంజయ్ యాదవ్, కోల్‌సవాడి, అఫ్జల్‌గంజ్,
A-4) మహేష్ హల్లె యాదవ్ @ కోల్‌సవాడి, బేగంబజార్, హైదరాబాద్
A-5) ప్రశాంత్ బిరాదార్, ఫిష్ మార్కెట్, బేగంబజార్,

మరో ఇద్దరు మైనర్ లను అరెస్ట్ చేసి జీవైనల్ హోమ్ తరలించారు పోలీసులు. పరారీలో మరో ఇద్దరు. ఎ-6: ఉజ్వల్, ఎ-7: హృతిక్ నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

Atchennaidu: బస్సు యాత్రలో వస్తోంది మంత్రులు కాదు.. అలీబాబా 40 దొంగలు

Exit mobile version