Site icon NTV Telugu

Secunderabad Crime: సికింద్రాబాద్‌లో దారుణం.. భర్త కళ్లముందే భార్య హత్య..

Secendrabad Crime

Secendrabad Crime

Secunderabad Crime: సికింద్రాబాద్ మహాంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధ రాత్రి దారుణం చోటుచేసుకుంది. రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం. భర్త చూస్తుండగానే భార్యపై బండరాయి వేసి హత్య చేశాడో వ్యక్తి. భర్త భయంతో అరుస్తున్నా తన చేయిపట్టుకుని ముందుకు లాగి ఆమెపై బండరాయి వేశాడు. దాంతో ఆమె బాధతో విలవిల లాడింది.

Read also: Ponniyin Selvan 2: రుద్ర తాండవం చేసినట్లుంది…

తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహిళా మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి భర్త కళ్లముందే భార్యను హతమార్చుతున్న భర్త ఎందుకు ఆపలేదు? హత్యతో భర్తకు ఏమైనా సంబంధం ఉందా? లేక గుర్తు తెలియని వ్యక్తి ఒక యాచకురాలిని చంపేంత కసి ఏముంది? భర్త పక్కనే ఉండగా ఏ ధైర్యంతో ఆమెను హతమార్చాడు. భర్తే ఆమెను చంపేందుకు ప్లాన్‌ వేశాడా? లేక హతమార్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉండి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
MS DHONI : ఆ మిస్టెక్ వల్లే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం..

Exit mobile version