Karimnagar Bear Migration: కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం మొదలైంది. శాతవాహన విశ్వ విద్యాలయంలో అర్ధరాత్రి సమయంలో ఎలుగుబంటి సంచరిస్తుండం కెమెరాకు చెక్కింది. ఎలుగుబంటి సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగు బండి సంచారం ఇది మొదటిసారి కాదని ఇలా చాలామార్లు జరిగాయని విద్యార్థులు చెబుతున్నారు. ఎలుగు బంటి సంచారంతో బయటకు వెళ్లాలంటేనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వర్షాల కారణంగా ఎలుగు బంటి, ఇతర జంతువులు జన సంచారంలోకి వస్తున్నాయని వాపోతున్నారు.
Read also: Kishan Reddy: అవసరమయితే కేంద్ర బలగాలు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇలాగే జరిగితే విద్యాలయానికి రావడానికి భయంగా వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవిశాఖ అధికారులు, శాతవాహన విశ్వ విద్యాలయ సంస్థవారు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మార్చిలో ఎలుగుబండి సంచారంతో యూనివర్షిటీకి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిన దాఖలాలు కూడా వున్నాయి. జిల్లా కేంద్రంలోని గ్రానైట్ పరిశ్రమ పేరుతో వందల ఎకరాల్లో ఉన్న గుట్టలను నాశనమవడంతో.. క్రూర మృగాలు జనారణ్యంలోకి రాకుండా చూడాలని కోరుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రకృతి విధ్వంసంతో వణుకుతోంది. వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల వీటి ప్రభావం మనుషులపైనే కాదు, అన్ని జీవరాశులపైనా పడుతుంది. గుట్టలు కనుమరుగవుతుండడంతో ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణులు తమ నివాసాలను కోల్పోతున్నాయి.
Dehi Liquor Scam: లిక్కర్ స్కాం.. కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధం?