దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాలకు ఇప్పటికే విస్తరించిన ఈ వేరియంట్.. క్రమంగా మిగతా చోట్లకు విస్తరిస్తోంది. తాజాగా జర్మనీలో ఒకరు ఒమిక్రాన్ బారిన పడగా.. బ్రిటన్‌లో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. B.1.1529 వేరియంట్ బోట్స్‌వానా, బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్‌లకు వ్యాపించింది. ఒమిక్రాన్ వైరస్ కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాపిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈమేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఒమిక్రాన్ వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. విదేశాల నుంచి వస్తున్న వారి నుంచి కొత్త మ్యూటేషన్ మన దగ్గర వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
కోవిడ్ ప్రభావం తగ్గంది.. కానీ పూర్తిగా కనుమరుగైపోలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ప్రభుత్వం తరఫు నుంచి సిద్ధంగా ఉన్నాం… ప్రజలే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. కొత్త వేరియంట్ లక్షణాలు కూడా సేమ్ ఉన్నాయని వెల్లడించింది. డెల్టా వేరియంట్ కంటే… 30 శాతం తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. థర్డ్ వేవ్‌లో కేవలం చిన్న పిల్లలకు సోకుతుందనే అపోహ వీడండి.. పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. చిన్నపిల్లలకు కరోనా సోకుతుంది కానీ… తీవ్రత ఎక్కువగా ఉండదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ఈ విషయం రుజువైందని తెలిపారు.
