NTV Telugu Site icon

Basara IIIT : మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని కలిసిన బాస‌ర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ

Basara Iiit

Basara Iiit

Basara IIIT VC Meet Minister Indrakaran Reddy.
బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు పడకేసాయి. అయితే గతంలోనే విద్యార్థులు కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోరుబాట పట్టి పట్టారు. దీంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా బాసర ట్రిపుట్‌ ఐటీకి చేరుకొని విద్యార్ధులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనలను విరమించారు. అయితే ఇటీవల మళ్లీ ఆహారంలో నాణ్యత లోపించి విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్‌ అయ్యింది. అంతేకాకుండా సంజయ్‌ అనే విద్యార్థి కూడా అస్వస్థతతో మరణించాడు. దీంతో మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని బాస‌ర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ కలిశారు. విశ్వ‌విద్యాల‌యంలో తీసుకుంటున్న చ‌ర్య‌లను మంత్రికి వీసీ వివరించారు.

క్యాంటీన్ నిర్వ‌హ‌ణ‌- ఆహార నాణ్య‌త‌, భోధ‌న‌, బోధ‌నేత‌ర విషయాల గురించి వీసీ … మంత్రికి వివ‌రించారు. స‌మ‌స్య‌లు పునరావృతం కాకుండా ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌, ద‌శ‌ల వారీగా వాటిని అమ‌లు చేయ‌డం, విద్యార్థుల‌కు ఇచ్చిన హామీలను నెర‌వేర్చ‌డం, క‌మిటీల ఏర్పాటు, త‌దిత‌ర అంశాల గురంచి చ‌ర్చించారు. విద్యార్థుల భ‌విష్య‌త్, వారి ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్య‌మ‌ని మంత్రి ఇద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే యూనివ‌ర్సిటీని సంద‌ర్శించి, క్షేత్ర స్థాయిలో ప‌రిశీలిస్తానని తెలిపారు.