Kamareddy: రుణం చెల్లించలేదని ఓ రైతు ఇంటి తలుపులను బ్యాంకు సిబ్బంది దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో జరిగిన సంఘటన మరువక ముందే కామారెడ్డి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష
కామారెడ్డి జిల్లా దుర్కి సహకార బ్యాంక్ లో ఓ రైతు రుణం తీసుకున్నాడు. కొద్ది కొద్దిగా కడుతూ వస్తున్నాడు. అయితే పంట చేతికి రాక, కుటుంబ బాధ్యతలు పెరగుతూ రావడంతో.. రుణం చెల్లించడం కాస్త ఆలస్యమైంది. దీంతో పలు మార్లు రైతు ఇంటికి వెళ్లి బెదిరించిన బ్యాంక్ సిబ్బంది ఇక ఏకంగా రైతు ఇంటి వెళ్లి రుణం చెల్లించమని కోరారు. కానీ రైతు చేతికొచ్చిన పంట అకాల వర్షాలకు నాసనమైందని కాస్త సమయం ఇవ్వాలని కోరారు. దానికి బ్యాంక్ సిబ్బంది కుదరదు ఇప్పుడే చెల్లించాలని డిమాండ్ చేశారు. దానికి రైతు తన వద్ద లేదంటూ ప్రాధేయపడ్డాడు. కాళ్లవేళ్లాపడ్డాడు. కనికరం చూపని సొసైటీ సిబ్బంది రైతు ఇంటి తలు పులు తొలగించి రుణం చెల్లించేంత వరకు తలుపులు ఇచ్చే సమస్యలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతడితో ఆగలేదు అక్క మరో రైతు ఇంట్లో రుణం చెల్లించాలని కోరగా ఆరైతుకూడా కాస్త టైం కావాలని అడగ్గా.. రైతు ఇంట్లో సామగ్రి, రైతు కుమారుడి ల్యాప్ టాప్, ద్విచక్ర వాహనం జప్తు చేసి తీసుకెళ్లారు. అన్నం పెట్టే రైతన్నకు ఆదుకునే దిక్కులేక సొసైటీ అధికారులు దౌర్జన్యాలకు బలవుతున్నారు. రుణం తీసుకుంది కొంతైతే.. చెల్లించేది కొండంతగా మారుతోంది. సొసైటీ అధికారుల తీరు పై రైతు సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Wife Plan: భర్తను సిగరెట్ తాగొద్దంటే వినలేదు.. భార్య మాస్టర్ ప్లాన్..