బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆదేశ రచయిత్రి తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పై మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ మత చాంధస్స వాదులు హిందువుల ఇళ్లను, షాపులను నాశనం చేశారన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు. ప్రధాని షేక్ హసీనా మత చాంధస్స వాదంలోకి వెళ్తున్నారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు ఉన్నారని వారిపై దాడులు సరికాదన్నారు. బంగ్లాదేశ్‌లో కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాల వారు ఉన్నారన్నారు.
హ్యూమన్‌రైట్స్ ఆర్గనైజేషన్ ప్రకారం బంగ్లాదేశ్‌లో హిందువులపై 3,700 సార్లు దాడులు జరిగాయన్నారు. ఇప్పటి వరకు వారికి న్యాయం చేయలేదన్నారు. షేక్ హసీనా ముజబీర్ రెహమాన్ కూతరు, ఆమె సెక్యూలర్ దేశానికి ప్రాధాన్యం ఇస్తారు. భారతదేశంలో కూడా ఆమెపై మంచి అభిప్రాయం ఉంది. ఇప్పటికైనా ఇస్లామిక్ పేరుతో దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు రచయిత్రి తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు సరికాదు: తస్లీమా నస్రీన్
