రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్యాలయం వద్ద 16 మంది కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్ కుమార్ స్టే విధించారు. ఫిబ్రవరి 16న అవిశ్వాస సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు రంగారెడ్డి కలెక్టర్ అనుమతిని సవాల్ చేస్తూ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు. 30 రోజుల్లో జరగాల్సిన అవిశ్వాస తీర్మానం ప్రక్రియను 34 రోజుల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? అంటూ ప్రశ్నించారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
16వ తేదిన అవిశ్వాస తీర్మానం పై బలప్రదర్శన ఉండగా కమీషనర్ శరత్ ఉదయం ట్విస్ట్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం పై హైకోర్టు స్టే ఇచ్చిందంటూ 16 కార్పొరేటర్లకు స్టే ఆర్డర్ కాపీలను కమీషనర్ అందజేశారు. 22 తారీకున బలప్రదర్శన ఉంటుంది అంటూ స్టే ఆర్డర్ ఇచ్చారు. న్యాయస్థానం కూడ అవినీతి పరులకు కొమ్ముకాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ మహేందర్ గౌడ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అందిన కాడికి దండుకున్నాడని, అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ ను ఎట్టి పరిస్థితుల్లో గద్దే దించుతామని కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టారు. 16 మంది కార్పోరేటర్లకు మేయర్ మహేందర్ గౌడ్ 1 కోటి రూపాయల ఆఫర్ చేసారని కార్పొరేటర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Russia President: మై డియర్ ఉమెన్స్.. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనండి
ఆ ఆఫర్ కు మేము లొంగలేదని మండిపడ్డారు. అవినీతిని అంతం మొందించడం మా లక్ష్యమని తెలిపారు. అవినీతి పరుడైన మేయర్ ను గద్దే దించుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ చేసిన అవినీతి, అక్రమాలు బయట పెట్టి అతనికి సహకరించిన వారి బండారం బయట పెడుతాం కార్పొరేటర్లు పేర్కొన్నారు. కాగా.. గత నెలరోజుల క్రితమే అవిశ్వాస తీర్మానం పెట్టినా..అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల సమయంలో అందరూ తనకు సహకరించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరడంతో అప్పటికి సమయం మించిపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 22 మంది కార్పొరేటర్లు ఉండగా, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 16 మంది కార్పొరేటర్లు కలెక్టర్ శశాంక్‌కు అవిశ్వాస లేఖ ఇచ్చారు మేయర్ మహేందర్ గౌడ్. మేయర్ మహేందర్ గౌడ్ తరపున నలుగురు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Coach Jai Simha: కోచ్ జై సింహా వెనకాల కొంత మంది ఉన్నారు.. సస్పెండ్ చేస్తే సరిపోదు!