NTV Telugu Site icon

Bandi Sanjay: గల్లీలో ఎవరున్నా సరే.. ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలి..!

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఉండాలని ఎంపి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల పార్లమెంట్ స్థాయి నమో నవ యువ ఓటర్లు సమ్మేళనంలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది ఒక ఆయుధం లాంటిది.. ఒక్క ఓటుతో దేశ భవిష్యత్తు మారిపోతుందన్నారు. పేద, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తున్నారని అన్నారు. బాగా డబ్బు సంపాదించి ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఓట్లు వేయడం లేదని అన్నారు. ఒక్క ఓటుతో ఎన్నికల్లో ఓడిపోయినా వ్యక్తులు ఎందరో నాయకులు ఉన్నారని తెలిపారు. సమాజంలో ఓటు వేస్తేనే విలువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశంలో మరొక్కసారి ప్రధాని గా మోడీ కావాలంటే కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి గెలవాలన్నారు. 2047 సంవత్సరం వరకు దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే దిశగా మార్చడమే మోడీ లక్ష్యం మని అన్నారు. దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉద్యోగాలు కల్పించారన్నారు.

పేద,మధ్యతరగతి కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి ప్రధాని మోడీ అని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ది కోసం 8వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకువచ్చామన్నారు. 10 ఏండ్లు పాలించిన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. సోషల్ మీడియా అని మీటింగ్ లు పెట్టీ తప్పుడు పోస్టులు పెట్టీ బిజెపి పార్టీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కొట్లాడితే నాపై అక్రమంగా 100 కేసులు పెట్టించి అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. తనని, తన కుటుంబాన్ని చంపుతానని అనేక సార్లు బెదిరించారని తెలిపారు. తను ఏ మతానికి, కులానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ.. నా ధర్మం గురించి మాత్రం గొప్పగా చెప్పుకుంటామన్నారు. అయోధ్య రామ మందిరం కోసం అనేక మంది కర సెవకులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. రాముని అక్షింతలతో కొంతమంది నాయకులు రేషన్ బియ్యం అంటూ ఎగతాళిగా మాట్లాడారని మండిపడ్డారు.

జమ్ము కాశ్మీర్ లో 370 డి ఆర్టికల్ కోసం పోరాడిన ఎందరో విద్యార్థి విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. ఏంఐఎం నాయకులు హిందూ దేవుళ్ల పట్ల అసభ్యకరంగా మాట్లాడారని తెలిపారు. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. యువతి, యువకులు దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎబివిపి కార్యకర్తల పట్ల పోలీసుల దాడిని బండి సంజయ్ ఖండించారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని నిరసన చేస్తున్న ఎబివిపి కార్యదర్శి జాన్షి పై పోలీసుల జులుం హేయమైన చర్య అన్నారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం దుర్మార్గమైన చర్య కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
MLC Kavitha: జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు.. కవిత కౌంటర్