NTV Telugu Site icon

Bandi Sanjay: కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్‌.. బోరున ఏడ్చినకార్యకర్తలు

Bandi Sanajay

Bandi Sanajay

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగిస్తూ ఇటీవల అగ్రనాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఆయనను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇది బండి సంజయ్ అభిమానులను మరింత నిరాశకు గురి చేసింది. దీంతో కొందరు బండి సంజయ్ అభిమానులు బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత ఎంపీ బండి సంజయ్ తొలిసారిగా కరీంనగర్ వచ్చారు. శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో కలిసి మహాశక్తి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని సంజయ్‌ను పట్టుకుని ఏడ్చాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్‌ను తొలగించడంపై బండి అసంతృప్తి వ్యక్తం చేశారు. అభిలాష్ అనే అభిమాని బండి సంజయ్‌ను పట్టుకుని ఏడ్చాడు. దీంతో అతడిని ఒప్పించే ప్రయత్నం చేశారు. బండి సంజయ్‌ను పట్టుకుని ఏడుస్తుండగా, ఇతర కార్యకర్తలు ఆయనను పక్కకు తీసుకెళ్లి ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత బండి సంజయ్ వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

Read also: Liquor : విమానంలో, మెట్రోలో, రైలులో ఎంత మద్యం తీసుకెళ్లవచ్చో తెలుసా?

గ‌త కొంత కాలంగా బండి సంజయ్ మార్పుపై చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆయన్ను మారిస్తే కేడర్‌కు, ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్‌ వెళుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్‌ని మార్చలేడని కొందరు నమ్ముతున్నారు. కానీ ఆయనను అనూహ్యంగా తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించడం పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి వస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వకుంటే జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక పదవి ఇస్తానని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. అయితే బండి సంజయ్‌కి ఎలాంటి పదవి ఇస్తారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
Samantha : ఖుషి సినిమా షూటింగ్ ను సమంత పూర్తి చేసిందా…?