Site icon NTV Telugu

Praja Sangrama Yatra: 5వ రోజు ప్రారంభమైన బండిసంజయ్ పాదయాత్ర.. రాంపూర్ లో రాత్రి బస

Bandisanjay Padayatra Started On 5th Day

Bandisanjay Padayatra Started On 5th Day

Bandisanjay Padayatra started on 5th day: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన “ప్రజా సంగ్రామ యాత్ర” 5వ రోజుకు చేరుకుంది. ఇవాళ నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబకంటి గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. బాంనీ, నందన్, నర్సాపూర్, కుస్లీ గేట్, నసిరాబాద్ మీదుగా రాంపూర్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. నర్సాపూర్ లో కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు బండి సంజయ్ పాదయాత్ర మొత్తం 12.1 కిలోమీటర్ల మేరకొనసాగునుంది. ఈరోజు రాంపూర్ సమీపంలో రాత్రి బసచేయనున్నారు బండి సంజయ్.

read also: Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాలా హత్యలో కీలక సూత్రధారి అరెస్ట్..

నిన్న నిర్మల్ జిల్లా నైట్ క్యాంప్ నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమయ్యింది. 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కావడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్‌ అందుకుంది. ముధోల్ నియోజకవర్గం, లింబ గ్రామం సమీపంలోని రాత్రి శిబిరం నుంచి పాదయాత్ర షురూ అయ్యింది. లింబ గ్రామం నుంచి సేవాలాల్ తండా, ఓల, కుంటాల మీదుగా అంబకంటి వరకు పాదయాత్ర కొనసాగనుంది. నేడు మొత్తం 11.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర అనంతరం అంబకంటి సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేశారు.

read also:Gun Firing In Nagole: పక్కా రెక్కీ చేసి అట్టాక్ కు ప్లాన్.. టార్గెట్ వారిద్దరే!

నిన్న జరిగిన సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యమమే చేయలేదని, ఎందరో బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పేదోడు చనిపోతే, పెద్దోడు రాజ్యమేలుతున్నాడని.. ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు ఏడుస్తున్నాయని అన్నారు. ఓవైపు వడ్ల కుప్పల మీద రైతులు తమ ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు కేసీఆర్ కుటుంబంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలున్నాయని.. ఇప్పుడున్న చిన్నోడు పెద్దోడైతే, అతనికి కూడా ఓ ఉద్యోగం రెడీగా ఉందన్నారు. కానీ.. తెలంగాణలోని యువతకి మాత్రం ఉద్యోగాలు లేవన్నారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఇరుక్కుందని.. మరి ఆమెను జైల్లో పెట్టాలా? వద్దా? అని ప్రశ్నించారు.

Exit mobile version