హుజురాబాద్ బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని..ఎవరు వచ్చినా ఈటల రాజేందర్ గెలుపును ఆపలేరని పేర్కొన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరా బాద్ ఉప ఎన్నిక కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అధికార పార్టీకి అసలు అభ్యర్థి దొరకడం లేదని.. పొర్లు దండాలు పెట్టిన అక్కడ గెలిచేది బీజేపీనేనని స్పష్టం చేశారు. అడ్డదారిలో టీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్… కేసీఆర్ వల్లనే రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాకుండా పోయాయని మండిపడ్డారు.
read also : భాగ్యనగర్ టు హుజురాబాద్.. బండి సంజయ్ పాదయాత్ర
299 tmc లకు ఒప్పుకున్నాడు..ఇప్పుడు 50-50 అంటున్నారని.. 575 టీఎంసీ లు రావాల్సిన నీటికి బదులు 299 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని నిప్పులు చెరిగారు. రోజా ఇంటికి వెళ్లి రాయల సీమ ను రతనాల సీమ చేస్తానని అనలేదా ? అని సీఎం కేసీర్ ను నిలదీశారు. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి మహాపాద యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తామన్న ఆయన.. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించి హుజురాబాద్ వరకు నడవనున్నట్టు వెల్లడించారు.
