Bandi Sanjay: రామ మందిర నిర్మాణం బీజేపీకి సంబంధించిన కార్యక్రమం కానేకాదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామయ్య అందరికీ దేవుడని అన్నారు. ప్రతి భారతీయుడు రాముడి విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. రామమందిర నిర్మాణం బీజేపీకి సంబంధించిన కార్యక్రమం కానేకాదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణానికి సానుకూలమా? వ్యతిరేకమా? స్పష్టం చేయాలని ప్రశ్నించారు. పవిత్రమైన కార్యక్రమాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్ కు తగదన్నారు.
Read also: Warangal Auto Workers: పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించండి.. స్వచ్ఛ ఆటో కార్మికులు నిరసన..
అయోధ్య నుండి శ్రీరాముడి అక్షింతలు ఇంటింటికి వెళుతున్నాయని తెలిపారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదు? ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యూడిషియల్ విచారణ అడుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.
Priyanka Singh: కొత్త కారు కొన్న బిగ్ బాస్ ప్రియాంక.. ఎన్ని లక్షలో తెలుసా?