Site icon NTV Telugu

Bandi sanjay: అసోం సీఎంను మాట్లాడనీయకుండా మైక్ లాక్కోవడం హేయమైన చర్య

Bandi Sanjay

Bandi Sanjay

గణేశ్ ఉత్సవ కమిటీలో సీఎం కేసీఆర్‌ని విమర్శించినందుకు, నందుబిలాల్ వెనక నుంచి ఒక్కసారిగా చొచ్చుకొని వచ్చి అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మైక్ లాక్కొని, ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే దీనిపై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ సీరియస్‌ అయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మను స్టేజీపై మాట్లాడనీయకుండా టీఆర్ఎస్‌ నేత మైక్‌ లాక్కోడం హేయమైన చర్య అని మండిపడ్డారు. గణేష్‌ నిమజ్జన ఉత్సవాలకు హైదరాబాద్‌ కు ముఖ్య అతిథిగా వచ్చిన అసోం సీఎంను గౌరవించాలనే కనీస సోయి లేకుండా టీఆర్‌ఎస్‌ నేతలు నీచంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు.

మెడలో గులాబీ కండువా వేసుకున్న టీఆర్‌ఎస్‌ నేతలను ప్రోటోకాల్‌ లేకుండా పోలీసులు లేకుండా పోలీసులు స్టేజీపైకి ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర సీఎంకి ఇచ్చే భద్రత ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ కు కేంద్రం భద్రత కల్పించకపోతే ఆయన స్వేచ్ఛగా వెళ్లగలుగుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగా తిరగగలరా? అని వ్యాఖ్యానించారు. లక్షలాది మంది పాల్గొనే శోభాదయాత్రకు హాజరయ్యేందుకు అసోం నుండి వచ్చిన ముఖ్య అతిధి అడ్డుకుంటే పరువుపోతుందనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గు చేటన్నారు.

భారతదేశంలోనే అతి తక్కువ కాలంలో అద్భుతమైన పాలనతో అసోం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న గొప్ప వ్యక్తి హిమంత బిశ్వశర్మ అని బండి సంజయ్‌ అన్నారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ.. ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలనా చేస్తున్న అసోం సీఎంని చూసి టీఆర్‌ఎస్‌ వాళ్లు నేర్చుకోవాలన్నారు. ఇక టీఆర్ఎస్ నాయకులను పంపించి అసోం ముఖ్యమంత్రిపై దాడి చేయించే కుట్రచేయడం సీఎం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. సీఎం హిమంత బిశ్వశర్మపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం కేసు పెట్టి.. ఈ దాడికి పురిగొల్పిన మంత్రులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులను గౌరవించాలనే కనీస సోయిలేని కేసీఆర్.. జాతీయ పార్టీ పెడుతానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. నగరంలో.. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులెవరూ పాల్గొనలేదన్నారు.
Saturday Venkateswara swamy Stothraparayanam Live: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..

Exit mobile version