NTV Telugu Site icon

Basara IIIT: బాసరకు బండి సంజయ్.. విద్యార్థులతో..

Basara12

Basara12

గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ (నాలుగోరోజు)కూడా ఆందోళనకు సిద్దమవుతున్న నేపథ్యంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లనున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను కలిసి వారి సమస్యలను, డిమాండ్లను బండి సంజయ్ తెలుసుకోనున్నారు.

కాగా.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. నిన్న బాసర ట్రిపుల్ ఐటీలో మూడోరోజు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్, స్టూడెంట్స్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వెంటనే 6 డిమాండ్లను పరిష్కరిస్తామని.. అయితే మిగతా 5 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు అధికారులు. దీంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లలో ఒకరు విద్యాలయాన్ని సందర్శించి కచ్చితమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు.

మరోవైపు.. కాసేపట్లో నాలుగోరోజు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన ప్రారంభం కానున్న నేపలథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఆంక్షలు విధించారు. దారుల్లో భారిగా పోలీసులు మోహరించారు.
ట్రిపుల్ కి వచ్చే దారుల్లో, గోదావరి నుంచి అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద బారికేడ్లు, తాళ్ళు కట్టేశారు. ఇవాళ బండి సంజయ్ కూడా అక్కడకు వెల్లనుండటంతో.. ఉద్రిక్తత నెలకోనే పరిస్థితి ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.

Presidential Poll: రాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ.. ఏకగ్రీవమా, ఎన్నికా?