Site icon NTV Telugu

Bandi Sanjay: కదిలిన బండి పాదయాత్ర.. మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు..

Bandi Sanjay Padayatra

Bandi Sanjay Padayatra

Bandi Sanjay: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత పాద యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్చనలు పూర్తయిన తర్వాత మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను ప్రారంభిస్తారు. ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ యాత్రకు వెళ్లనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజాహిత యాత్ర’ పేరుతో మొత్తం 119 కి.మీల మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టనున్నారు. సంజయ్ ఇవాల ఉదయం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు కొండ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లోని మేడిపల్లి గ్రామంలో తన మొదటి దశ ‘ప్రజాహిత యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఆయన పాదయాత్ర మొదటి దశ ఫిబ్రవరి 15న ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read also: 30 Years Industry Prudhvi Raj: శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే..! టీడీపీ-జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 ఎంపీ సీట్లు..!

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పొడవునా ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో “ప్రజాహిత పాదయాత్ర” చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధమైంది. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతోపాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివ్రుద్దికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 20 నుండి మలి విడత యాత్రకు చేపట్టనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్ యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు షెడ్యూల్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
New Railway Line: తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. హైదరాబాద్- విజయవాడ తగ్గనున్న ప్రయాణ సమయం

Exit mobile version