Bandi sanjay: కరీంనగర్ జైలు నుంచి ఇవాళ ఉదయం రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ విడుదలైన విషయం తెలిసిందే. ఆయన నేరుగా అత్తవారింటికి వెళ్లారు. అయితే.. బండి సంజయ్ అత్తగారింట్లో ‘బలగం’ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఆ సినిమాలో పిట్ట ముట్టనట్లే.. తన అత్తమ్మకు చనిపోవడంతో పిండం పెడితే పక్షి ముట్టలేదని సంజయ్ తెలిపారు. ‘మా అమ్మ తర్వాత కన్నకొడుకులా మా అత్తగారు చూసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బండిసంజయ్. పిండం పెడితే పక్షి ముట్టలేదని మా ఇంట్లో వారు బాధపడుతున్నాని అన్నారు. దేశం, పార్టీ తర్వాతే కుటుంబ సభ్యులు అని సంజయ్ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌కు పక్షి ముట్టే కార్యక్రమానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారుని మండిపడ్డారు.
Read also: Amritpal Singh: పంజాబ్ పోలీసులకు అమృత్‌పాల్ సింగ్ ఎఫెక్ట్.. సెలవులు రద్దు.. బైసాఖి వరకు హైఅలర్ట్
బండి సంజయ్ అత్తమ్మ (సతీమణి అపర్ణ మాత్రుమూర్తి) చనిపోయి 9వ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం కరీంనగర్ వచ్చారు. పేపర్ లీకేజీ విషయంలో పోలీసులు అర్ధరాత్రి బండి సంజయ్ ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేసేశారు. తన అత్తమ్మ చనిపోయి 9వ రోజు కార్యక్రమం వుందని చెప్పినా వినకుండా సంజయ్ ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించిన తనని ఆరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇప్పుడు అత్తమ్మకు పిండం పెడితే పక్షి ముట్టలేదని భావోద్వేగానికి గురయ్యారు.
Kiran Kumar Reddy Joins Bjp Live: బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి