Site icon NTV Telugu

Bandi Sanjay : సీఎం, ఆయన కుటుంబం పెద్ద అవినీతి కుటుంబం

మా నాయకుల పరువు తీసే ప్రయత్నం చేశారు.. దీనిపై సీఎం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి కేసులు, పత్తాల కేసులు, రేప్ కేసులు, కబ్జా కేసులు అన్నింటిలో టీఆర్‌ఎస్‌ నేతలే ఉన్నారని ఆయన విమర్శించారు. పోలీసులు ఢిల్లీలో ఇంటి పై ఎలా దాడి చేస్తారని, బరి తెగించి ఉన్నామని సమాజానికి చెపుతున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిందని, కేసు పెట్టిన జితేందర్ రెడ్డి పీఏ పై ఇక్కడ కేసు పెట్టారు.. ఆయనకు తెలంగాణ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. సర్వే లన్ని బీజేపీ అనే చెబుతున్నాయని, దీంతో సీఎం డిప్రెషన్ లో ఉన్నారన్నారు.

సీఎం, ఆయన కుటుంబం పెద్ద అవినీతి కుటుంబమని, నిన్నటి ఘటన పై ఉన్నత స్థాయి విచారణ జరగాలన్నారు. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని, సలహాలు, సూచనలు ఇస్తూ అరాచకాలు చేయాలని అంటున్న వారిపై కూడా విచారణ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీ భయపడదు.. తెగించి కొట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీపై సీఎం ఎలాంటి కుట్రలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనించాలని, శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై గతంలో ఆధారాలతో సహా బయట పెట్టాం సీఎం చర్యలు తీసుకున్నారా అని ఆయన మండిపడ్డారు.

Exit mobile version