Site icon NTV Telugu

Bandi Sanjay : యూపీకి పోయి ఏదో పొడుస్తా అన్నాడు.. ఏమైంది.. కేసీఆర్

ఉక్రెయిన్ లో తెలుగు బిడ్డలు చిక్కుకుంటే కనీసం సమీక్ష నిర్వహించలేదు.. ఒక్క విద్యార్తి తో అయినా మాట్లాడారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవ్వాళ వెళ్లి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్వాగతాలు పలుకుతున్నారు.. సిగ్గుండాలి వాళ్లకు అని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ను గజగజ వణికిస్తున్న పార్టీ బీజేపీ అని, నువ్వేం చేయలేవు.. నీతో ఏమి కాదు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. మూర్ఖుడు, అతడి కుటుంబం తెలంగాణను ఏలుతోందని, శ్రీకాంత చారి, ఉద్యమకారుల చరిత్ర కనుమరుగైందని, కేసీఆర్ చరిత్ర మాత్రమే కనబడాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు.

యూపీకి పోయి ఏదో పొడుస్తా అన్నాడు.. ఏమైంది.. కేసీఆర్ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడే వ్యక్తులను అరెస్ట్ చేశారు వెంటనే విడుదల చేయాలని, గోవులను రక్షించుకునే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలపై కేసు పెట్టారని ఆయన అన్నారు. లాఠీ దెబ్బలకి భయపడే పార్టీ బీజేపీ కాదని, మరోసారి ఉద్యమం చేయాల్సిందే.. ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. కేసీఆర్ ను తరిమికొట్టే ఉద్యమం కావాలని, అన్ని పార్టీలు ఏకమై బీజేపీని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆయన అన్నారు.

Exit mobile version