Site icon NTV Telugu

Bandi Sanjay : ఈ నెల 15న ఖమ్మంకు తెలంగాణ బీజేపీ చీఫ్‌

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈ నెల 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడాలో భారీగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రానున్నారు. ఈ నేపథ్యంలో…  బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు.. సభను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా జనసమీకరణ చేస్తున్నాయి.

ఇటీవలే కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నేతల వరకు జనసమీకరణ చేయాలంటూ బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు నిర్ధేశించారు. అయితే ఈనెల 14వ తేదీన ఈ సభ  అనంతరం.. ఈ నెల 15న ఖమ్మం జిల్లాలో బండి సంజయ్‌ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని బండి సంజయ్‌ పరామర్శించనున్నారు. దీంతో.. ఖమ్మం బీజేపీ శ్రేణులు బండి సంజయ్‌ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version