NTV Telugu Site icon

Bandi Sanjay: ఈటలకి నాకు ఎలాంటి కోల్డ్ వార్ లేదు.. క్లారిటీ ఇచ్చిన బండిసంజయ్

Bandisanjay

Bandisanjay

Bandi Sanjay: ఈటల కి నాకు ఎలాంటి కోల్డ్ వార్ లేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం 200 యూనిట్లకు, 500గ్యాస్ సిలిండర్ హామీలకు వ్యతిరేఖం కాదు..కానీ కొర్రీలు పెట్టద్దని అన్నారు. మ్యానిఫెస్టోలో రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకే అని చెప్పలేదు అందరికి స్కీంలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వాలని, వారం రోజుల్లో ఇవ్వచ్చని తెలిపారు.
10 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేశారు.. ఆ తర్వాత కరంటు, గ్యాస్ ఇవ్వాలి అప్పుడే ప్రభుత్వ నిబద్ధత తెలుస్తాదని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎపుడైనా రావచ్చని క్లారిటీ ఇచ్చారు. నిజాయితీ ఉంటే 6 గ్యారంటీలను ఎన్నిక ల షెడ్యూల్ లోపల అమలు చేయాలన్నారు. ఎకరానికి 15 వేలు,మహిళలు కు 2500, పెన్షన్, ఇళ్ల స్థలాలు, 2 లక్షల రుణమాఫీ, నోటిఫికేషన్ ,317 జిఓ, నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు.

Read also: Hanuman Statue: ప్రపంచంలోనే ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన

ఇవి నెరవేర్చడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటో చెప్పాలన్నారు. అప్పుల రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చెప్పాలన్నారు. అసెంబ్లీ వేదికగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒకరికొకరు దూషించుకోవడానికి అసెంబ్లీ వేదిక కారాదు… ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ఉపయోగపడాలన్నారు. టచ్ లు, అంతు చూస్తామంటే వేరే వేదిక చూసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రజలు బతుకులు నాశనం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకరికొకరు ఆరోపణలు చేసుకొని ప్రజల దృష్టి మల్లిస్తారన్నారు. భాష విషయంలో హద్దు మీరి అహంకారంతో మాట్లాడద్దన్నారు. సీఎం స్థాయి చైర్ కి గౌరవం ఇవ్వాలన్నారు. ఆ స్థాయి వ్యక్తిని చెప్పుతో కొడుతా అనడం సిగ్గు చేటన్నారు. ఇది సబబు కాదని ఖండిచారు. ప్రజా హిత యాత్ర పేరుతో 10 నుంచి యాత్ర ప్రారంభిస్తామని, గ్రామాల్లో పాద యాత్ర.. పార్లమెంట్ స్థాయిలో యాత్ర ఉంటుందని తెలిపారు. 17 కి 17 పార్లమెంట్ స్థానాలు గెలువబోతున్నామన్నారు.

Read also: Shilpa Shetty : శిల్పా శెట్టి ఇలాంటివి కూడా చేస్తారా?నెటిజన్స్ ఫిదా..

ప్రజలలో మోడీ ని pm గా చూడాలని అనుకుంటున్నారు. సర్వే రిపోర్టులు అనుకూలంగా ఉన్నాయని, తప్పుడు పాలన చేసింది బీఆర్ఎస్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి , ప్రజల హక్కులు, పేపర్ లీకేజీలు, స్టూడెంట్స్ ఆత్మహత్యలపై పోరాడింది నేనే.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల కోసం పని చేసేలా చేసింది నేనే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కి రైట్ హాండ్ వినోద్ కుమార్ అంటూ సంచలన వ్యాక్యలు చేశారు. ఈటలకి నాకు ఎలాంటి కోల్డ్ వార్ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈటల రమ్మనలేదు కాబట్టే రాలేదన్నారు. ఓడిపోయే వారే ఇంట్లో ఉంటారు.. గెలుస్తా కాబట్టే ప్రజల్లోకి వెళ్తున్నా అన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు మూడో స్థానం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే మీఅంసంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మేము చేసిన అభివృద్ధి, దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎన్నికలకు వెళ్తామన్నారు. మోదీ ప్రభుత్వం మూడోసారి రావాలి అపుడే దేశ అభివృద్ధి అన్నారు.
Hanuman Statue: ప్రపంచంలోనే ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన