Site icon NTV Telugu

Bandi Sanjay : అధికార ప్రతినిధులపై ఫైర్‌..

Bandi

Bandi

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధుల పై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు బండి సంజయ్‌. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధులుగా చేయాల్సిన పనులు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలని , వెంటనే స్పందించాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశౄరు. ఇకపై జరుగుతున్న సంఘటనలపై స్పందించాలని, అలెర్ట్ గా ఉండాలని సూచించారు.

సమాచార సేకరణలో అధికార ప్రతినిధుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్‌ అసహానం వ్యక్తం చేశారు. అధికార పార్టీ విమర్శలపై వెంటనే స్పందించడం లేదని బండి సంజయ్ క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. 9 మంది అధికార ప్రతినిధులున్నా పార్టీకి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, అధికార ప్రతినిధుల్లో రోజు ఒకరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని అదేశించారు. జిల్లాల్లో జరిగే ఘటనలపై నేతలను అప్రమత్తం చేసి లైనప్ ఇవ్వాలని బండి సంజయ్ సూచించారు.

Exit mobile version