మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు చెల్లించాలి : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.కేసీఆర్ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
మా పిల్లలు తినే బియ్యాన్నే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తింటున్నారని పదేపదే గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ పిల్లలు పస్తులుండటాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు? అని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. కార్మిక చట్టాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనాన్ని వెంటనే పెంచాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు అతి తక్కువ గౌరవ వేతనాన్ని చెల్లిస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేనని మండిపడ్డారు.మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
- Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth Reddy: ‘2034 వరకు నేనే సీఎంగా ఉంటా.. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి’: సీఎం రేవంత్ రెడ్డి
- Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
- Tags
- bandi sanjay
- cm kcr
తాజావార్తలు
-
Kajal Aggarwal: “అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు”.. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
-
El Nino: సూపర్ ఎల్‌నినో వచ్చేసిందన్న శాస్త్రవేత్తలు.. రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!
-
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
-
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!