Site icon NTV Telugu

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు చెల్లించాలి : బండి సంజ‌య్‌

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుండి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటని మండిప‌డ్డారు.కేసీఆర్ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిప‌డ్డారు.

https://ntvtelugu.com/12-deaths-and-104-people-hospitalised-by-omicron-says-uk/

మా పిల్లలు తినే బియ్యాన్నే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తింటున్నారని పదేపదే గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ పిల్లలు పస్తులుండటాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు? అని నిల‌దీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. కార్మిక చట్టాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనాన్ని వెంటనే పెంచాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు అతి తక్కువ గౌరవ వేతనాన్ని చెల్లిస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేన‌ని మండిప‌డ్డారు.మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version