Bandi Sanjay Demands KTR To Resign As IT Minister: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఐటీ శాఖ విఫలమైందని, ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ను పదవి నుంచి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నేరస్తులను కాపాడటం కోసమే సిట్ వేశారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీని పూర్తిగా రద్దు చేసి.. వారిని ప్రాసిక్యూషన్ చేయాలని కోరారు. ఆ కమిషన్‌కు తెలియకుండా ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయ్యిందన్న ఆయన.. ఛైర్మన్ వద్ద ఉండాల్సిన పాస్‌వర్డ్ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు తప్పు చేయనప్పుడు.. సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ ఎందుకు జరిపించడం లేదని నిలదీశారు. టీఎస్‌పీఎస్‌సీ నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారని చెప్తున్నారని.. మరి అలాంటప్పుడు ఆ కమిషన్‌కి ఛైర్మన్ ఎందుకని అడిగారు.
Australia Couple Lottery: అదృష్టమంటే ఇది.. భార్య అలిగింది, 16 కోట్ల లాటరీ తగిలింది
ఇదంతా సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ డ్రామా అని బండి సంజయ్ ఆరోపించారు. తన కొడుకు తప్పు చేస్తే కేసీఆర్ స్పందించరని.. అదే ఇతర మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ తప్పు చేస్తే.. వారిని వెంటనే బర్తరఫ్ చేసేవారని అన్నారు. తన కొడుకు కాపాడుకోవడం కోసం.. ఈ వ్యవహారం వెనుక బీజేపీ కార్యకర్త హస్తం ఉందంటూ కేసీఆర్ సరికొత్త డ్రామాను మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. ఈ మాట అనడగానికి సిగ్గుండాలని మండిపడ్డారు. 2017లో టీఎస్ఎస్ ఉద్యోగిగా పని చేసిన వ్యక్తిని టీఎస్‌పీఎస్‌సీలో పెట్టారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ఒక వ్యక్తిని రిక్రూట్ చేసుకోవడానికి ముందు.. చిన్న చిన్న కంపెనీలే ఎంతో బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తారని, అలాంటిది బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోకుండానే టీఎస్‌పీఎస్‌సీలో ఆ వ్యక్తిని పెట్టారా? అని ప్రశ్నించారు. ఆ వ్యక్తితో ఉన్న ఫోటోని చూపిస్తూ తనకు సంబంధం ఉందని ఆరోపణలు చేస్తున్నారని.. రోడ్డు మీద సిగ్నల్ దగ్గర కూడా తాను ఎంతోమందితో సెల్ఫీలు దిగుతుంటానని కౌంటర్ ఇచ్చారు.
Man Hits Daughter In Law: ఉద్యోగం చేస్తానన్న పాపానికి.. ఇటుకతో కోడలిపై మామ దాడి
ఈ ప్రశ్నాపత్రం లీకేజ్‌లో ప్రధాన కారకురాలైన రేణుక అనే అమ్మాయి బీఆర్ఎస్ సర్పంచ్ అని, ఆమె అన్నయ్య బీఆర్ఎస్ నేత అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ పేపర్ లీక్ చేసింది బీఆర్ఎస్ అని ఆరోపించారు. కానీ.. బీజేపీని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ నోటిఫికేషన్‌లు ఇచ్చి, బండి సంజయ్ అపారని నిందలు మోపుతున్నారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ విఫలమైంది కాబట్టి.. ఆ శాఖ మంత్రి అయిన కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు కేటీఆర్ రాజీనామా చేసే వరకు వదిలి పెట్టమన్నారు. సీఎం కుటుంబానికి ఒక రూల్, ఇతరులకు మరో రూల్ అని.. మంత్రులు దీనిపై ఆలోచించాలని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.