BJP: బీజేపీ కార్యాలయంలో మహిళా గోస -బీజేపీ భరోసా దీక్షను పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. దీక్షలో బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డికే అరుణ కూర్చున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సాయంత్రం 4 గంటల వరకు దీక్షలో కొనసాగుతుంది.
Husband Escaped: ట్రాఫిక్‌లో భార్యని వదిలి భర్త పరార్.. తెరవెనుక ఇంత తతంగమా?
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎత్తిచూపేందుకు ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని చేపట్టారు బండి సంజయ్. తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో మహిళలను నిరుత్సాహపరిచేందుకు, సిఎం కుటుంబాన్ని కాపాడేందుకు మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకురావడంలో దాని పన్నాగాన్ని బట్టబయలు చేసేందుకే ఈ దీక్ష చేపట్టినట్లు చెప్పారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నిరసనను తిప్పికొట్టేందుకు తెలంగాణ బీజేపీ హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ‘దీక్ష మహిళా గోస-బీజేపీ భరోసా’ నిర్వహిస్తోంది.
Xi Jinping: ముచ్చటగా మూడోసారి.. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ప్రమాణస్వీకారం
అంతకుముందు మహిళా మోర్చా నాయకులతోనూ బండి సంజయ్ మాట్లాడారు. 2014 నుంచి అధికారంలో ఉన్న సీఎం కుటుంబం మహిళా రిజర్వేషన్ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తావించలేదన్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితకు తప్ప ఎవరికీ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం నలుగురు మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చారు.
