Site icon NTV Telugu

Bandi Sanjay: హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల కోసమే ధరణి తీసుకువచ్చాడు.

Bandi Sanjay

Bandi Sanjay

కేసీఆర్ రాజు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గడీల నుంచి బయటకు రాడని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. చేసిన తప్పులను సమర్థించుకునే మూర్ఖడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని విమర్శించాడు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలు ధరణిలో నమోదు కాలేదని.. నమోదైన వాటిలో 50 శాతం తప్పులే ఉన్నాయని అన్నారు. . ధరణి అనేది గొప్ప పోర్టల్ అని చెబుతున్నాడని.. సీఎంది నోరా మోరా అని విమర్శించారు. ధరణితో ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టాడని విమర్శించారు. ప్రజలకు, మీ మధ్యలో అధికారులు ఇబ్బంది పడుతున్నారని.. అధికారులకు అధికారాలు ఇవ్వాలని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా సమాధానం ఇస్తారని ఆయన అన్నారు. నీ భాష, వ్యవహార శైలి, నీ భయం చూశాక నీకు ఎవ్వరూ ఓటు వేయరని అన్నారు.

రాష్ట్రములో ఏ సమస్య వచ్చినా కుర్చీ వేసుకుని తీరుస్తా అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అలా చేయడం లేదని అన్నారు. పేద ప్రజలు, అడవి బిడ్డలపై సీఎం కేసీఆర్ దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. 2018 ఎన్నికల్లో పోడు భూముల వ్యవహారం తేలుస్తా అని చెప్పాడని.. అన్ని ఎన్నికల సందర్భంగా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. హైదరాబాద్ చుట్టూ భూములు సాధించేందుకే ధరణి తీసుకువచ్చారని ఆరోపించారు బండి సంజయ్.

Read Also: Eetala Rajender: కేసీఆర్‌ను గజ్వేల్ ప్రజలే బొందపెడతారు

కేసీఆర్ కర్మకాలి తెలంగాణకు సీఎం అయ్యాడు: డీకే అరుణ

కేసీఆర్ తెలంగాణకు కర్మకాలి సీఎం అయ్యాడని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. పాస్ పోర్ట్ బ్రోకర్ నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తామని అన్నారు. దుబాయ్ శేఖర్ బుద్ది మారడం లేదని విమర్శించారు. కేసీఆర్ నీకు పోగాలం దాపురించిందని అన్నారు. దేవుళ్ల మీద కూడా మాట్లాడతావా..? ఇంత కన్నా దిగజారుతావా అని ప్రశ్నించారు. జోగులాంబ అమ్మవారిని అవమానించేలా మాట్లాడతావా.. నీకు ఒంటి నిండా అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో జీతాలు టైమ్ కు ఇవ్వని నువ్వు జీడీపీ గురించి మాట్లాడుతావా..? అని ప్రశ్నించారు.  పీయూష్ గోయల్ చుట్టూ తిరిగింది మీరు.. చిల్లర నా కొడుకులు మీరు అంటూ తీవ్రపదజాతంలో దూహించారు. తెలంగాణలో లుంగీలు కట్టుకుంటారు.. అది దక్షిణాది కల్చర్ అని అన్నారు. యూపీ సీఎం నీలాగా ఫార్మ్ హౌజ్ లో పడుకోడని.. దయలేని రాక్షసుడు కేసీఆర్ అని విమర్శించారు.

 

 

 

 

 

Exit mobile version