NTV Telugu Site icon

BJP Telangana: ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బండి సంజయ్‌, ఈటలకు హెలికాప్టర్

Bandi Sanjay Etal Rajender

Bandi Sanjay Etal Rajender

BJP Telangana: తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. అయితే.. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలకంగా మారారు. వీరిద్దరి కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను సిద్ధం చేసింది. సంజయ్ రోజుకు మూడు సమావేశాల్లో పాల్గొనేలా బండి కార్యాచరణ రూపొందించారు. తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థులు బండి సంజయ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. కరీంనగర్‌లో ప్రచారం నిర్వహిస్తూనే వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఎన్నికలకు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకు పార్టీ తరపున హెలికాప్టర్ కేటాయించారు.

బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ గా ఆయనకు ఈ అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని పార్టీకి లబ్ధి చేకూర్చాలని అధినాయకత్వం యోచించినట్లు అర్థమవుతోంది. జీహెచ్‌ఎంసీతోపాటు దుబ్బాక, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా గెలుపొందిన ఘనత సంజయ్‌కే దక్కింది. కార్యకర్తల్లో ఆయనకు మాస్ ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు సంజయ్ సభలకు త్వరగా చేరుకునేందుకు హెలికాప్టర్ ను కేటాయించిన సంగతి తెలిసిందే. సంజయ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులకు కూడా హెలికాప్టర్లను కేటాయించారు. అయితే కరీంనగర్ అసెంబ్లీ సర్కిల్‌లో నిలిచిన సంజయ్ ఉదయం 11 గంటల వరకు తన సొంత నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రతిరోజూ రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఏయే నియోజకవర్గాల్లో ఆయన పాల్గొనాలి, ఎన్ని సభల్లో బండి సంజయ్ ప్రసంగంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్, కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.

కాగా.. ఈరోజు సిద్దిపేటలోని వంటమామిడి చెక్ పోస్ట్ వద్ద మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈటెల రాజేందర్‌తో పాటు కాన్వాయ్‌లోని వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Urfi Javed : బ్రేకింగ్ న్యూస్..రోడ్డు మీద ఉర్ఫి జావేద్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..