NTV Telugu Site icon

PM MODI: వరంగల్‌లో ప్రధాని మోడీ సభ.. పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై నిషేధం

Modi

Modi

PM MODI: ప్రధాని మోడీ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజిలో ప్రధాని మోడీ సభ విజయ సంకల్ప సభకి ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా సిబ్బంది వేదికని అణువణువు తనిఖీ చేస్తున్నారు. 3500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై పోలీసులు నిషేధం విధించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 45నిమిషాలు తెలంగాణలో ఉండనున్నారు ప్రధాని మోడీ.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.25 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 9.30 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్‌ ద్వారా వరంగల్‌ బయలుదేరుతారు. 10.15 గంటలకు వరంగల్‌ మామునూరు విమానాశ్రయంలోని హెలీప్యాడ్‌లో దిగుతారు. 10.15 గంటలకు మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి బై రోడ్ బయలుదేరుతారు. 10.30 గంటలకు భద్రకాళి దేవాలయానికి చేరుకుంటారు. 10.30 నుంచి 10.45 గంటల వరకు అమ్మవారికి పూజలు చేస్తారు.10.50 గంటలకు భద్రకాళి ఆలయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు.11.00 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల గ్రౌండ్ లోని సభా స్థలికి చేరుకుంటారు.11.00 గంటల నుంచి 11.35 గంటల వరకు పీవోహెచ్‌, వ్యాగన్‌ తయారీ యూనిట్‌తో పాటు జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 11.45 గంటలకు బహిరంగ సభ వేదిక పైకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.20 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
12.20 నుంచి 12.30 గంటల వరకు పార్టీ నేతలను కలుసుకుంటారు. 12.30 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 12.50 గంటలకు వరంగల్‌ మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ చేరుకుంటారు. 12.55 గంటలకు మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు. 1.40 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 1.45 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్‌ బీబీజే విమానం ద్వారా బయలుదేరుతారు. 3.35 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.

వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో.. భద్రత ఏర్పాట్లపై సీపీ రంగనాథ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. మోడీ పర్యటన సందర్భంగా తాము మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలకు అదనంగా.. ఇద్దరు ఐజీ స్థాయి, 10 మంది డీసీపీ ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 56 సీఐలు, 250 మంది ఎస్సైలు, 3500 మంది పోలీసులు.. బందోబస్తు విధుల్లో ఉంటారని వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నామని.. పబ్లిక్ కమిషన్ ఎగ్జామ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే.. 8 గంటల వరకే పరీక్ష కేంద్రాలకే చేరుకోవాలని సూచించారు. అదాలత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వాహనాలకు అనుమతి లేదన్నారు. మోడీ సభకు వచ్చే కార్యకర్తలు.. 9 నుంచి 9.30 లోపే గ్రౌండ్‌కు చేరుకోవాలన్నారు. ప్రధాని టూర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Heavy Rains: రానున్న 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. క‌ర్నాట‌క‌లో 8 మంది మృతి

Show comments