NTV Telugu Site icon

Balka Suman: కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనవాళ్ళే.. బాల్కాసుమన్‌ సంచలన వ్యాఖ్యలు

Balka Suman

Balka Suman

Balka Suman: కాంగ్రెస్‌లో ఉన్నది మనవాళ్లేనని, మననే పంపారని అన్నారు. వెంకన్న రాలేదా.. అలాగే వాళ్లుకూడా వస్తారంటూ చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉన్నది మనవాళ్లేనని వెంకన్న బీఆర్‌ఎస్‌ లోకి వచ్చినట్లు అలాగే వాళ్లుకూడా వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది నిజమా కాదా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే మనమే కొందరిని పార్టీ లోకి పంపించామని, కాంగ్రెస్ పార్టీలోకి కొందరు కోవర్ట్‌లను పంపామని అన్నారు. రాజకీయాలు అన్నప్పుడు కొన్ని తెలివి తేటలు ప్రదర్శిస్తాం కదా అని అన్నారు. వాళ్లు అక్కడక్కడ తిరిగితే వాళ్లను ఏమీ అనవద్దు అంటూ సుమన్‌ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయొద్దని బాల్కసుమన్‌ కోరారు. ఆ కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల తర్వాత మా పార్టీలో చేరతారని అన్నారు.

గతంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ వెంకటేష్ మా పార్టీలో చేరారు.. ప్రస్తుత కాంగ్రెస్ నేతలు.. బీఆర్‌ఎస్‌కు కూడా వస్తారని.. తమ ప్రచారాన్ని ఆపవద్దని కార్యకర్తలను ఉద్దేశించి సుమన్ అన్నారు. కాంగ్రెస్‌లో తన బినామీలు ఉన్నారని అన్నారు. దయచేసి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను, నాయకులను కోరుతున్నా అని వారు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరైనా చెన్నూరు వస్తే దయచేసి వాళ్లను ఏమీ అనకండి అన్నారు. సోషల్‌ మీడియాలో కానీ, ఊళ్లలో వచ్చినా కానీ దయచేసి వాళ్లను ఎవరు ఏమీ అనకండి అన్నారు. వాళ్ల ప్రచారం వాళ్లు చేసుకుంటారు మన ప్రచారం మనం చేసుకుంటామన్నారు. వాళ్లు రెండు తిట్లు ఎక్కువ తిట్టిన మీరేమి అనకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. నన్ను తిడితేనే కదా నమ్మేది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రాజకీయంలో 15 రోజులు 20 రోజులు ఇలా నడుస్తుంటాయి కాబట్టి పౌరుషానికి పోవద్దని సూచించారు. ఎవరి పార్టీవారు ఎవరి ప్రచారం వారు చేసుకుంటారు.

అంతిమంగా జనాలకు తెలుసు నాలుగున్నరేళ్లుగా ఎవరు ఈ గడ్డమీద ఉన్నారు. ఎవరు చెన్నూరు గడ్డ అభివృద్ది కోసం తపన పడ్డారని, ఎవరు వేల నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారనేది ప్రజలకు తెలుసని అన్నారు. ఒకప్పుడు మారుమూల ప్రాంతమైన నియోజక వర్గం ఇప్పుడు చెన్నూరు అంటే తెలియని వ్యక్తి లేడని అంత స్థాయి ఎత్తు ఎదిగిందో చెన్నూరు ప్రజలకు తెలుసని అన్నారు. బీఆర్‌ఎస్‌ తప్పకుండా 94 సీట్లు గెలుస్తామని అన్నారు. ఈ సంఖ్య రాను రాను ఇంకా పెరుగుతుంది కానీ.. తగ్గదని తెలిపారు. చెన్నూరు ప్రజలు వానను కూడా లెక్కచేయకుండా ఇంత పెద్ద ర్యాలీ చేయడం చాలా సంతోషమని అన్నారు. చెన్నూరులో వేరే నాయకులు వచ్చిన ఏమీ కాదని అన్నారు. వారికి మీరు ఎలాంటి సమాధానం చెబుతారన్నది తెలుసని అన్నారు.
Astrology: ఆగస్టు 27, ఆదివారం దినఫలాలు