Site icon NTV Telugu

టీడీపీని ముంచారు… కాంగ్రెస్‌నీ ముంచుతారు : బాల్క సుమన్

తెలంగాణ పీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డిపై ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ ఫైర్‌ అయ్యారు. రేవంత్‌ రెడ్డి టీడీపీని నట్టేటా ముంచేశారని.. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా మునగడం ఖాయమని.. అందులో అసలు అనుమానమే లేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌ రెడ్డి నోటికి ఏది వస్తే.. అదే మాట్లాడతారని మండిపడ్డ ఆయన..రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంతోనే కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని వెల్లడించారు.

read also : మరోలేఖ విడుదల చేసిన మావోయిస్టులు..

దళితజాతి వ్యతిరేక పార్టీ బీజేపీ అని.. రాజ్యాంగ రచయిత అంబేద్కర్ ను గుర్తించని పార్టీ కాంగ్రెస్ బాల్క సుమన్‌ ఫైర్‌ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల పై అరాచక దాడులు జరుగు తున్నాయని…. దళితుల అభివృద్ధి నచ్చదు కాబట్టి విద్యార్థులకు స్కాలర్ షిప్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి ఓర్చుకోలేకపోతున్నారని.. దళితులను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని నిప్పులు చెరిగారు.

Exit mobile version