Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Balka Suman Fired On Bjp Mla

Balka Suman : బీజేపీ ఎమ్మెల్యేలు చిల్లర ప్రయత్నం చేశారు

Published Date :March 8, 2022 , 3:21 pm
By Gogikar Sai Krishna
Balka Suman : బీజేపీ ఎమ్మెల్యేలు చిల్లర ప్రయత్నం చేశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్‌ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు ముందే అనుకొని నల్ల కండువాలతో అరిచారని, స్పీకర్ వెల్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఆ సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారని, ఇటీవలే హిమాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను వారం పాటు సస్పెండ్ చేశారన్నారు.

దేశంలో గతంలో చట్ట సభల నుంచి సభ్యులను సస్పెండ్ చేసిన సందర్బాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రణాళికబద్దంగా వచ్చారని, బీజేపీ ఎమ్మెల్యేలు చిల్లర ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్ చేయడంలో కొత్త లేదు… వింత లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని, తెలంగాణకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటి కోసం బీజేపీ ఎమ్మెల్యేలు మోడీ ముందు, హోం మంత్రి కార్యాలయం ముందు నల్ల కండువా వేసుకొని ధర్నా చేయండని ఆయన సవాల్‌ విసిరారు.

https://ntvtelugu.com/mlc-jeevan-reddy-about-singareni-incidents/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • bjp mla
  • MLA Balka Suman
  • mla etela rajender
  • mla raghunandan

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions