Site icon NTV Telugu

Balka Suman: రోషం, పౌరుషము ఉంటే సంజయ్ రాజీనామా చేయాలి

ఏప్రిల్‌ 2వ తేదీన హైదరాబాద్ లో రాడిసన్‌ హోటల్ లోని పబ్ పై పోలీసులు చేసిన దాడి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పబ్ పై టాస్క్
ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు కూడా ఉండటం గమనార్హం. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
మేనల్లుడు, బీజేపీ నాయకురాలు కుమారుడు ఈ పబ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్
మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ వ్యవహారంలో వారి నాయకులు, పిల్లలు ఉన్నారు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్, రేవంత్ రెడ్డి తమ అధ్యక్ష పదవులు కి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
గంజాయి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

మనిషివి.. రోషం, పౌరుషము ఉంటే సంజయ్ రాజీనామా చేయాలంటూ ఆయన సవాల్‌ విసిరారు. నువ్వు చేతగాని దద్దమ్మవి, నువ్వు ఏమి చేస్తున్నావో అందరికి తెలుసు అంటూ ఆయన ధ్వజమెత్తారు. విచారణ సాఫీగా జరగాలంటే రేవంత్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని, నీ మేనల్లుడును కంట్రోల్ చేయలేని వాడివి.. నువ్వు ఏమి చేస్తావన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు డ్రగ్ కల్చర్ కి అలవాటు పడ్డారని, ఉప్పల అభిషేక్ ను షూట్ చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. వాళ్లే చేసి వాళ్ళే ధర్నాలు చేస్తారని, పబ్ లలో డ్రగ్స్, కొకైన్ వాడడం తప్పు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు నిజ స్వరూపం బయట పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

https://ntvtelugu.com/raja-singh-fired-on-balka-suman/

Exit mobile version