కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ… దేశ చరిత్రలు ముఖ్యమంత్రి ఆలోచించని గొప్ప పథకం దళిత బంధు పథకం అని దళిత జాతి ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి విద్యారంగంలో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించి… ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ పథకం హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇక్కడ అమలు జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తారు. కావాలని బీజేపీ పార్టీ ఈ పథకం అమలు జరగకుండా కుట్రలు చేస్తున్నారని.. దళిత జాతి వాటిని తిప్పి కొట్టి కేసీఆర్ వెంటే ఉండాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో కొత్త పథకాలను ప్రవేశ పెట్టినప్పుడు కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి అందులో ఉండే లోటుపాట్లను అధిగమించి ఏ విధంగా దేశ వ్యాప్తంగా అమలు చేస్తుందో అదే పద్దతిలో ఈ దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారని అన్నారు.
మొదట హుజూరాబాద్.. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు
