Site icon NTV Telugu

ట్రాఫిక్‌ కష్టాలకు ఇక చెక్‌ : హైదరాబాద్ లో మరో ఫ్లై ఓవర్‌ సిద్ధం

హైదరాబాద్‌ ప్రజలకు మరో గుడ్‌ న్యూస్‌. 2017 లో మంత్రి కేటీఆర్‌ శంకు స్థాపన చేసిన.. బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ. 385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇరువైపులా రెండు డివిజన్లు ఉండగా… ఒకటి ఫతేనగర్‌, మరొకటి బాలానగర్‌. ఇక ఈ రెండు డివిజన్లలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది.

read also : మరోసారి భగ్గుమన్న పెట్రో ధరలు

ఇక బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి.. 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగజ్జీవన్‌రామ్‌ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు. ఇది ఇలా ఉండగా.. రూ. 385 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని రేపు మంత్రి కేటీఆర్‌ ప్రారంభిం చనున్నారు. దీంతో బాలానగర్‌ ఏరియాలో ట్రాఫిక్‌ సమస్యలు తప్పనున్నాయి.

Exit mobile version